‘జైలర్‌2’ రజినీకాంత్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..? | Jailer2 Budget And Rajinikanth Remuneration Revealed | Sakshi
Sakshi News home page

Rajinikanth Remuneration: ‘జైలర్‌2’ రజినీకాంత్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..?

Oct 11 2026 5:09 PM | Updated on Oct 11 2026 5:09 PM

Jailer2 Budget And Rajinikanth Remuneration Revealed

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటిస్తున్న క్రేజీ సీక్వెల్‌ ‘జైలర్‌ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. రెండో భాగంపై ఆసక్తి నెలకొంది. అయితే రజినీకాంత్‌ పారితోషికానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రూ.300 కోట్ల వరకు బడ్జెట్‌?
ఈ సినిమా బడ్జెట్‌ నటీనటుల పారితోషికాలతో కలిపి సుమారు రూ.240 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే నిర్మాణానికి అయ్యే అసలు ఖర్చును రూ.100 కోట్ల లోపే ఉంచినట్లు సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్‌కు సుమారు రూ.110 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  అదనంగా సినిమా లాభాల్లో కూడా వాటా దక్కే అవకాశం ఉందట. ఈ వివరాలపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణన్‌, విద్యాబాలన్‌, ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరమూడు, విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: నటితో బలవంతంగా వ్యభిచారం.. రక్షించిన పోలీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement