
తమిళ నటుడు శరవణన్పై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. జైలర్, రాయన్, మేడమ్ సార్ వంటి చిత్రాలతో ఆయన తెలుగు వారికి కూడా పరిచయమే.. 1990లో వైదేహి వందాచ్చు అనే తమిళ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత, పొండాట్టి రాజ్యం, అభిరామి, మామియార్ విడు మొదలగు పలు చిత్రాల్లో నటించిన నటుడు శరవణన్. ఆ తరువాత క్యారెక్టర్‌గా పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. కాగా 2003లో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే, 2015 నుంచి సహజీవనం సాగిస్తున్న శ్రీదేవి అనే యువతిని 2018లో శరవణన్ రెండో వివాహం చేసుకున్నారు. కాగా వీరు స్థానిక మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఉన్న ఒకే భవనం మొదటి అంతస్తులో శరవణన్ మొదటి భార్య కింద భాగంలో రెండో భార్యతో శరవణన్ కలిసి నివసిస్తున్నారు. కాగా ఆవడి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు శాఖ ప్రజాసమస్యల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న నటుడు శరవణన్ మొదటి భార్య తన భర్తపై హత్యా బెదిరింపు ఫిర్యాదు చేశారు.
అందులో తాను శరవణన్ 1996 నుంచి 2003 వరకు సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్య శ్రీదేవి చెప్పారు. అప్పట్లో తాను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేదానినని దీంతో పలుమార్లు తాను ఆర్థికంగా శరవణన్‌ను ఆదుకున్నానని చెప్పారు. అలాంటిది ఆయన తనకు ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదేవిధంగా తనకు జీవన భరణిగా రూ. 40 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.