జూనియర్‌ ఎన్టీఆర్‌ను వెనక్కు నెట్టిన అల్లు అర్జున్!‌

Introducing Pushpa Raj: Teaser Creates All Time Record With 50 Million Views - Sakshi

'ఆర్య', 'ఆర్య 2'.. అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఈ సినిమాలు ఎంతో ప్రత్యేకం.. బన్నీ ఫ్యాన్స్‌ ఫేవరెట్‌ సినిమాల లిస్టులో ఈ రెండు టాప్‌ ప్లేస్‌లో ఉంటాయి. బన్నీకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమాలకు దర్శకత్వం వహించింది సుకుమార్‌. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో వస్తున్న సినిమా 'పుష్ప'. ఏప్రిల్‌ 7న పుష్ప టీజర్‌ రిలీజ్‌ అవగా అందులో బన్నీ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ షాకయ్యారు.

పుష్పరాజ్‌గా చేతిలో గొడ్డలితో ఊరమాస్‌ లుక్‌లో కనిపించి అభిమానులతో ఈలలు వేయించాడు బన్నీ. తను అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఓ రకంగా పూనకాలే తెప్పించాడు దేవిశ్రీ ప్రసాద్‌. తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా 'పుష్ప' రికార్డుకెక్కింది.

దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతూ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ  బన్నీనా? మజాకా? అంటూ నెట్టింట తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఆర్‌ఆర్‌​ఆర్‌లోని రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పట్టింది. కానీ బన్నీ మాత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్న పుష్పలో రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది. కానీ కరోనా కారణంగా ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఫిల్మీదునియాలో టాక్‌ నడుస్తోంది. మరి అదెంతవరకు నిజమనేది కూడా త్వరలోనే తేలనుంది.

చదవండి: 

షాకిచ్చిన‌ ‘పుష్ప’.. మరీ అన్ని నెలలా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top