షాకిచ్చిన‌ ‘పుష్ప’.. మరీ అన్ని నెలలా?

Allu Arjun Pushpa Movie Release Date Postponed: Check For New Date - Sakshi

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ ‘పుష్ప’ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇంతకముందు ఎన్నడు చేయని భిన్నమైన క్యారెక్టర్‌లో బన్నీ కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే పుష్పరాజ్‌గా అవతారమెత్తనున్నాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే పుష్ప టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్‌ ఊరమాస్‌ లుక్‌లో దర్శనమివ్వడంతో ప్రస్తుతం పుష్పరాజ్‌ హవా కొనసాగుతోంది. టీజర్‌లో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ వీర లెవల్లో ఉందంటూ అభిమానులు ఊగిపోతున్నారు. ఇక ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 34 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ప్రస్తుతం పుష్ప షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. క్రమంలో పుష్పకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఆగష్టు 13న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే రిలీజ్‌ డేట్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలలు వెనక్కి జరిగినట్లు సమాచారం. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యంకావడంతో ఇప్పుడు షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేయడం అసాధ్యంగా మారింది. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయితే పుష్పను దసరాకు విడుదల చేద్ధామని ఆలోచించారు.

చదవండి: 'పుష్ప'‌పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్‌

కానీ అప్పటి వరకు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్‌ పనులు పూర్తవుతాయన్న నమ్మకం లేకపోవడంతో మూవీని నాలుగు నెలల తర్వాత.. అంటే పుష్పను డిసెంబర్‌ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే విషయం నిజమైతే బన్నీ అభిమానులు నిజంగా ఇది చేదు వార్తే. కాగా160 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన​ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అంది​స్తున్నారు. ఫహద్ ఫజల్ విలన్‌ రోల్‌ చేస్తున్నారు.

చదవండి: పుష్ప టీజర్‌: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్‌‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top