అప్పట్నుంచి సీరియస్‌గా తీసుకున్నా: డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ

I Earned More As A Designer Than A Director Says Ramesh Varma - Sakshi

‘‘నేను డైరెక్టర్‌ కాక ముందు డిజైనర్‌గా ప్రతి ఏడాదీ వంద సినిమాలకు పని చేసేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే డిజైనర్‌గానే నేనెక్కువ సంపాదించాను. ముందు చంటిగారు..ఆ తర్వాత బెల్లంకొండ సురేశ్‌గారు డైరెక్టర్‌గా అవకాశాలు ఇచ్చారు. డైరెక్టర్‌గా నా జర్నీని మొదట్లో సీరియస్‌గా తీసుకోలేదు. ‘రాక్షసుడు’ సినిమా నుంచి సీరియస్‌గా తీసుకున్నా’’ అని అన్నారు రమేశ్‌ వర్మ. ఆదివారం రమేశ్‌ వర్మ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను.

ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయింది. జీవితంలో డబ్బు ముఖ్యమా? లేక భావోద్వేగాలు ముఖ్యమా? లేక రెండూ అవసరమా? అనే అంశాల ఆధారంగా ‘ఖిలాడి’ కథ ఉంటుంది. నా కెరీర్‌లో కూడా ‘ఖిలాడి’ హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ. దాదాపు 65 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. నిర్మాత కోనేరు సత్యానారాయణ నా పై నమ్మకంతో అప్పుడు ‘రాక్షసుడు’ చిత్రానికీ, ఇప్పుడు ‘ఖిలాడి’కీ చాన్స్‌ ఇచ్చారు. ‘రాక్షసుడు 2’ కోసం విజయ్‌ సేతుపతిని సంప్రదించాం. నేను, మారుతి కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని అన్నారు.

చదవండి : చిరు బర్త్‌డే : స్పెషల్‌ సాంగ్‌​తో చాటుకున్న అభిమానం
Chiru154 : పూనకాలు లోడింగ్‌.. అదిరిపోయిన పోస్టర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top