చిరు బర్త్‌డే: స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌ | Sakshi
Sakshi News home page

HBD Chiranjeevi: స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌

Published Sun, Aug 22 2021 5:35 PM

Megastar Chiranjeevi Birthday Special Song Launched By Srikanth - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు (ఆగ‌స్ట్ 22) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రత్యేకమైన వీడియోల ద్వారా చిరుకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ద‌ర్శ‌క ద్వ‌యం ర‌మేశ్ గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్ర‌త్యేక‌ంగా ఓ వీడియో సాంగ్‌ను రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.


త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..న‌రం న‌రం స్వ‌రం చిరంజీవ ’’ అంటూ సాగే ఈ పాట‌లో వివిధ సంద‌ర్భాల్లో అభిమానులు ఆయ‌న‌పై చూపించిన ప్రేమను వీడియోల ద్వారా చూపించారు. అంతేకాకుండా చిరు చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి కూడా ఇందులో ప్ర‌స్తావించారు. మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్‌ను చిర్రావూరి విజ‌య్ కుమార్ రాయ‌గా, హేమ‌చంద్ర ఆల‌పించారు. శ్రీవసంత్ ఈ పాట‌కు సంగీతాన్ని అందించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement