వైరలవుతున్న డాక్టర్‌ స్టెప్పులు.. స్పందించిన హృతిక్‌

Hrithik Roshan Responded On Assam Doctor Viral Vvideo - Sakshi

ముంబై : పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషం తెలిసిందే. అస్సాంకు చెందిన ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ అరూప్‌ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ ధరించి 'వార్‌' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వైద్యుడి డ్యాన్స్‌  నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఇంకేముంది సదరు డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కరోనా కష్ట కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి తన వృత్తిని కొనసాగిస్తూ, మరోవైపు రోగులను ఉత్తేజపరిచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం’ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: పీపీఈ కిట్‌లో డాక్టర్‌ అదిరిపోయే‌ స్టెప్పులు

తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ స్పందించారు. వైద్యుడు డ్యాన్స్‌ వీడియోను హృతిక్‌ రీట్వీట్‌ చేశాడు. 'డాక్టర్‌ అరూప్ తో చెప్పండి. నేను ఏదో ఒక రోజు అస్సాంలో అత‌ని డ్యాన్స్ స్టెప్పుల‌ను నేర్చుకుంటాను. అత‌నిలా డ్యాన్స్ చేస్తాను. అద్భుత ప్రదర్శన' అంటూ హృతిక్ రోష‌న్ రీట్వీట్‌ చేశాడు. కాగా డాక్టర్‌ స్టెప్పులకు బీటౌన్‌ ఇండస్ట్రీలోనే గొప్ప డ్యాన్సర్‌ అయిన హృతిక్‌ ఫిదా అయిపోయాడంటే అతడి డ్యాన్స్‌ ఏ లెవల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హృతిక్‌ స్పందించడంతో అమితానందం వ్యక్తం చేశారు డాక్టర్‌ అరూప్‌..“సర్, నేను డాక్టర్ అరుప్. చాలా ధన్యవాదాలు సార్‌. కహో నా ప్యార్ హై సినిమా నుంచి మీరు నా హీరో, మీలాంటి గొప్ప వారికి డ్యాన్స్‌ నేర్పే అంత వాడిని కాదు సార్‌. ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీరెప్పుడైనా అస్సాంకు రావచ్చు. అంటూ డాక్టర్‌ బదులిచ్చారు. చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top