వైరల్‌: అదిరిపోయే‌ స్టెప్పులేసిన డాక్టర్‌ | Assam Doctor Dances To Ghungroo To Cheer Up Covid Patients | Sakshi
Sakshi News home page

వైరల్‌: పీపీఈ కిట్‌లో డాక్టర్‌ అదిరిపోయే‌ స్టెప్పులు

Oct 19 2020 12:02 PM | Updated on Oct 19 2020 1:37 PM

Assam Doctor Dances To Ghungroo To Cheer Up Covid Patients - Sakshi

గువహతి: కరోనా వచ్చినటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వైద్యుల సేవలు మరువలేనివి. రోగుల ప్రాణాలను కాపాడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అయితే, పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ ధరించి 'వార్‌' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  (వైరల్‌ : ఈ బుడ్డోడు సామాన్యుడు కాదు)

‘అసోంలోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌ డ్యూటీ సహోద్యోగి, ఈఎన్‌టీ సర్జన్‌ అయిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతిని కలవండి. సిల్చార్‌ ఆస్పత్రిలో ఆయన కోవిడ్‌ బాధితులను ఉత్సాహపరిచే ప్రయత్నంలో భాగంగా వారిముందు డ్యాన్స్‌ చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు' అంటూ పోస్ట్‌ చేశారు. కాగా ఈ వీడియో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా వీక్షించగా.. 1,000పైగా కామెంట్లు, 15,000 లైక్‌లను సంపాదించుకుంది. కరోనా కాలంలో నెగిటివిటీని దరిచేరనీయకుండా.. మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండటమే మంచిదని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement