
హిట్3 సినిమాలో అర్జున్ సర్కార్‌గా పోలీస్ పాత్రలో దుమ్మురేపేందుకు నాని సిద్ధం అయ్యాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన 'మార్కో' సినిమాకు మించిన వయలెన్స్ హిట్-3లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చెప్పిన వ్యాఖ్యలను హిట్3 నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్ ఇచ్చారు. ఇదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు. హిట్ 3 సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది.
ఈ కామెంట్‌తో వెండితెరపై రక్తపాతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇప్పటికే హిట్ 3(Hit 3 Movie) గురించి నాని ఇలా హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఏ రేంజ్‌లో వయలెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా భారీ బడ్జెట్‌తో వాల్‍పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై నానినే ఈ చిత్రాన్ని నిర్మించారు.
