సస్పెన్స్ థ్రిల్లర్‌గా హైడ్ న్ సిక్ | Hide N Seek Trailer Out | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్‌గా హైడ్ న్ సిక్

Sep 10 2024 2:13 PM | Updated on Sep 10 2024 2:13 PM

Hide N Seek Trailer Out

విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్.  బసిరెడ్డి రానా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించారు. తాజా ఈ మూవీ ట్రైలర్‌ని తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో రిలీజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఈ చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 20 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు.

హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని థ్రిల్ కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. 

థియేటర్ లో చూసే ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బస్సు రెడ్డి రానా తెలిపారు

హీరో విశ్వంత్ మాట్లాడుతూ..   హైడ్ న్ సిక్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము అని, ఇలాంటి ఎనర్జీనే ఈ చిత్రానికి అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ చూసినా చిత్రం పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ వైబ్ తోనే సెప్టెంబర్ 20న థియేటర్లో కలుద్దామని.. ఈ సందర్భంగా దర్శకుడు బాసిరెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, అలాగే కాలేజీ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement