ఆ సినిమా తర్వాత నా కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోయింది: హీరో శ్రీకాంత్‌ | Sakshi
Sakshi News home page

Hero Srikanth: ఆ సినిమా తర్వాత పాతిక సినిమాలు చేసినా సక్సెస్‌ లేదు.. కారణం..

Published Wed, Dec 6 2023 2:57 PM

Hero Srikanth About his Career Graph Down - Sakshi

హీరో శ్రీకాంత్‌ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్‌ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రానురానూ శ్రీకాంత్‌ కెరీర్‌ డల్‌ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్‌ టాలీవుడ్‌లో సెంచరీ మార్క్‌ను సులువుగా దాటేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోవడంపై స్పందించాడు.

'ఆమె సినిమా హిట్టయింది. అప్పటికే తాజ్‌మహల్‌, పెళ్లి సందడి సినిమాలు కమిటయ్యాను. వాటితో పాటు ఆహ్వానం, వినోదం వంటి చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రిలీజ్‌గా ఉండేవి. హిట్‌ పడగానే పెద్దపెద్ద బ్యానర్లు వచ్చేవి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఈ పెద్ద బ్యానర్లు వెనక్కు వెళ్లిపోయేవి. 

మహాత్మ(2009) సినిమా తర్వాత నాకు పెద్ద దెబ్బ పడింది. ఇది నా వందో సినిమా. దీని తర్వాత నా కెరీర్‌ నెమ్మదిగా కిందకు పడిపోయింది. మహాత్మ తర్వాత ఓ పాతిక సినిమాలు చేశాను. కానీ ఏదీ విజయం సాధించలేదు. బహుశా టైం బ్యాడేమో.. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు' అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

చదవండి: తెలుగింటి హీరోయిన్‌.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న..

Advertisement
 
Advertisement
 
Advertisement