గోపీచంద్ గొప్ప మనసు.. అసిస్టెంట్ పిలిచిన వెంటనే..! | Sakshi
Sakshi News home page

Gopichand: అసిస్టెంట్ ఇంటికి వెళ్లిన గోపీచంద్.. ఎందుకంటే?

Published Wed, Mar 1 2023 4:04 PM

Hero Gopichand Visit His Assistant New Home Opening Ceremony - Sakshi

టాలీవుడ్‌లో గోపించంద్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోలలో ఆయన అంతా సింపుల్‌గా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో గోపీచంద్. ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా మరోసారి గోపీచంద్ తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే?

గోపీచంద్ దగ్గర అసిస్టెంట్‌గా శ్రీను అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఇటీవలే ఆయన సొంతిల్లు నిర్మించి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హీరో గోపిచంద్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వారితో కలిసి సరదాగా గడిపారు. గోపీచంద్ రాకతో అసిస్టెంట్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. దీంతో గోపీచంద్ సింప్లిసిటీని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా.. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో రామ బాణం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కనిపించనుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
 
Advertisement