మరో మహిళతో రొమాన్స్‌.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి | Sonakshi Sinha Opens Up On Intimate Scenes In Heeramandi, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Heeramandi: మరో మహిళతో రొమాన్స్‌.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి

Published Wed, May 8 2024 2:21 PM | Last Updated on Fri, May 10 2024 11:28 AM

Heeramandi: Sonakshi Sinha Opens Up On These Scenes

ప్రముఖ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మ‌ధ్య కాలంలో లాహోర్‌లో రెడ్‌లైట్‌ ప్రాంతంగా పేరున్న‌ హీరామండిలోని వేశ్య‌ల జీవితాల నేప‌థ్యంలో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు భన్సాలీ. 

(చదవండి: హీరామండి రివ్యూ)

మ‌నీషా కోయిరాలా , అదితిరావ్ హైద‌రీ, సోనాక్షి సిన్హా , ఫ‌ర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్‌ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్‌ పాత్ర వెబ్‌ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్‌ సీన్స్‌, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. 

తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్‌ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్‌ చేసిందని చెప్పుకొచ్చింది.  ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్‌ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్‌ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.

అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్‌ మాలిక్‌తో కలిసి సోనాక్షి ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్‌ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్‌ చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement