Akshay Kumar First Song: Hari Hara Song Out From Akshay Kumar Starrer Prithviraj Movie - Sakshi
Sakshi News home page

Akshay Kumar: ఈ సాంగ్‌ నా మనసుకు హత్తుకుంది

Published Thu, May 12 2022 3:59 PM

Hari Hara Song Out From Akshay Kumar Starrer Prithviraj Movie - Sakshi

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం "పృథ్వీరాజ్". ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. ఢిల్లీ సామ్రాజ్యంపై క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుంచి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నుంచి "హరి హర్" అనే మొదటి సాంగ్‌ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహమ్మద్ ఘోరీతో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృధ్వీరాజ్ చౌహాన్‌కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృధ్వీరాజ్ బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది. మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను"

అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ "చాణక్య"ని  తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది "పృథ్వీరాజ్‌" సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్  కనిపించనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది.

చదవండి: సాక్షి ఆడియన్స్‌ పోల్‌, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ

Advertisement
 
Advertisement
 
Advertisement