రాహుల్‌ సిప్లిగంజ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసిన హీరో నిఖిల్‌ | Happy Birthday Mama Song Released From Haseena Movie | Sakshi
Sakshi News home page

Haseena Movie: హ్యాపీ బర్త్‌డే సాంగ్‌ రిలీజ్‌ చేసిన హీరో నిఖిల్‌

Jul 30 2022 5:06 PM | Updated on Jul 30 2022 5:06 PM

Happy Birthday Mama Song Released From Haseena Movie - Sakshi

ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను.

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను యంగ్ హీరో నిఖిల్ విడుదల చేశారు విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ ట్యూన్‌ను అందించగా.. ప్రసాద్ నల్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

యంగ్ హీరో నిఖిల్  మాట్లాడుతూ.. ‘ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను కూడా ఈ సినిమా చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జానర్‌‌లను అందరూ ఎంకరేజ్ చేయాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు’ అన్నారు.

డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటను హీరో నిఖిల్ గారు రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నాని గారు, నిఖిల్ గారు, రవితేజ గారు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు’ అన్నారు. నటుడు సాయి తేజ మాట్లాడుతూ.. ‘నిఖిల్ అన్న వచ్చి మా సాంగ్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన ఈ పాటను రిలీజ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. నా బర్త్ డే సందర్భంగా ఈ పాటను ఆయన రిలీజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

చదవండి: Jr NTR ధరించిన టీషర్ట్‌ అంత ఖరీదా?
రవితేజకు భారీ షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement