Hamsa Nandini Returns To Sets After Battle With Breast Cancer - Sakshi
Sakshi News home page

Hamsa Nandini : బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను జయించి.. షూటింగ్‌లో పాల్గొన్న హంసానందిని

Dec 8 2022 3:53 PM | Updated on Dec 8 2022 4:24 PM

Hamsa Nandini Returns To Sets After Battle With Breast Cancer - Sakshi

నటి హంసానందిని క్యాన్సర్‌ను జయించింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్‌ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసా నందిని తాజాగా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది.

మూవీ సెట్‌లో మళ్లీ అడుగుపెట్టాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. నా పుట్టినరోజును నా కోస్టార్స్‌, మూవీ టీంతో సెలబ్రేట్‌ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే నేను కోలుకోగలిగాను. ఐ యామ్‌ బ్యాక్‌ అంటూ హంసా నందిని రాసుకొచ్చింది.

షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోను కూడా ఆమె షేర్‌ చేసుకుంది. దీంతో వెల్‌కమ్‌ బ్యాక్‌ అంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో ఐటెం సాంగ్స్‌లో కనువిందు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement