10 ఏళ్ల తర్వాత అలా చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ | Sakshi
Sakshi News home page

GV Prakash Kumar: జీవీ ప్రకాశ్ కుమార్ కొత్త సినిమా.. కాకపోతే!

Published Mon, Sep 4 2023 4:27 PM

GV Prakash Kumar Produced Another Movie After 10 Years - Sakshi

దక్షిణాది సినిమాల్లో జీవీ ప్రకాశ్ కుమార్‌కు ఒక బ్రాండ్‌ ఉంది. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. 'డార్లింగ్‌' మూవీతో హీరోగా మారాడు. అది హిట్‌ కావడంతో నటుడిగానూ సక్సెస్‌ అయ్యాడు. అలా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ గా సత్తా చాటుతున్న జీవీ ప్రకాశ్ కుమార్.. 2013లో నిర్మాతగా ఓ సినిమా తీశాడు. 

(ఇదీ చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గవర్నర్‌ పదవి?)

ఖదీర్‌-ఓవియా జంటగా విక్రమ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో 'మదయానై కూట్టం' అనే సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మించాడు. కోటి రూపాయల బడ్జెట్ పెడితే.. రూ.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయినా మరో సినిమాని నిర్మించలేదు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త మూవీ నిర్మించడానికి సిద్ధమయ్యాడు. 

ఈ సినిమాని నిర్మిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్.. హీరోగానూ నటిస్తున్నాడు. దీనికి 'కింగ్‌స్టన్‌' టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఇది జీవికి నటుడుగా 25వ చిత్రం. కమల్‌ ప్రకాష్‌ అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకుడు.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: నామినేషన్స్‌లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement