సూర్య సినిమా నుంచి వైదొలగిన జీవీ?, ఇదిగో క్లారిటీ  | GV Prakash Kumar Exit From Vaadivaasal | Sakshi
Sakshi News home page

సూర్య సినిమా నుంచి వైదొలగిన జీవీ?, ఇదిగో క్లారిటీ 

Jun 25 2023 8:39 AM | Updated on Jun 25 2023 8:44 AM

GV Prakash Kumar Exit From Vaadivaasal - Sakshi

తమిళ సినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్న మరో చిత్రం వాడివాసల్‌. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను భారీ ఎత్తున నిర్మించ తలపెట్టారు. సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవానికి ఈ చిత్రం 2020లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు సూర్య రిహార్సల్స్‌ కూడా చేశారు. అయితే దర్శకుడు వెట్రిమారన్‌ హాస్య నటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని ముందుగా తెరకెక్కించడానికి సిద్ధం కావడంతో వాడివాసల్‌ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది.

దీంతో సూర్య కంగువా చిత్రానికి సిద్ధమయ్యారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక నేపథ్యంగా సాగే ఈ చిత్రం ఫుల్‌ స్వింగ్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ వాడివాసల్‌ చిత్ర షూటింగ్‌ ప్రారంభంకావడంలో జాప్యం జరగడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది.

(చదవండి: టాప్‌ డైరెక్టర్‌తో శివకార్తికేయన్‌.. హీరోయిన్‌గా సీతారామం బ్యూటీ!)

అయితే దీని గురించి ఆయన వర్గం స్పందిస్తూ వాడివాసల్‌ చిత్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి పనిచేయడానికి జీవీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే వాడివాసల్‌ చిత్రం సెట్‌ పైకి వెళ్లడానికి ఇంకా కాస్త టైమ్‌ పడుతుందనే చెప్పాలి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement