సుద్ధాల అశోక్‌ తేజ రాసిన ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ సాంగ్‌ విన్నారా? | Gurur Brahma Song Out From Neethone nenu Movie | Sakshi
Sakshi News home page

Neethone nenu: సుద్ధాల అశోక్‌ తేజ రాసిన ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ సాంగ్‌ విన్నారా?

Sep 5 2023 4:42 PM | Updated on Sep 5 2023 4:42 PM

Gurur Brahma Song Out From Neethone nenu Movie - Sakshi

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా.. మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు  హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం (టీచ‌ర్స్ డే) సందర్భంగా ఈ మూవీ నుంచి  ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. గొప్ప స‌మాజం రూప క‌ల్ప‌న‌లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీల‌కం. అందుక‌నే వారిని బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌తో పోలుస్తుంటారు. అలాంటి టీచ‌ర్స్‌కు అంకిత‌మిచ్చేలా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట‌ను రూపొందించారు.ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్‌ తేజ ఈ పాటకు లిరిక్స్‌ అందించగా, ప్ర‌ముఖ సింగ‌ర్ మనో అద్బుతంగా ఆలపించారు. 

చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచ‌ర్స్ వ‌ల్లే అది సాధ్య‌మ‌వుతుంది. అలాంటి వారి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా మా సినిమాలో ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. మంచి టీమ్ స‌పోర్ట్‌తో సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ఈ సినిమా’అని అన్నారు. ‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది’అని డైరెక్టర్‌ అంజిరామ్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement