Satyadev, Tamannaah 'Gurthunda Seethakalam' Movie Trailer is Out! - Sakshi
Sakshi News home page

Gurthunda Seethakalam Trailer: మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్‌ కాదురా

Dec 3 2022 12:54 PM | Updated on Dec 3 2022 1:17 PM

Gurthunda Seethakalam Movie Trailer Out - Sakshi

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గుర్తుందా శీతాకాలం. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్,  మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా  నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 

మన  జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేం. అటువంటి జ్ఞాపకాలను ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ‘లవ్‌లో ప్రాబ్లమ్‌ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లమ్‌ అయితే..’,  మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్‌ కాదురా’ లాంటి డైలాగ్స్‌ ట్రైలర్ లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement