మీనాక్షి చౌదరి ఫేట్‌ మార్చేసిన మహేశ్‌ బాబు | Guntur Karam Movie Changed The Fate Of Meenakshi Chowdary - Sakshi
Sakshi News home page

Meenakshi Chowdary: మీనాక్షి చౌదరి ఫేట్‌ మార్చేసిన మహేశ్‌ బాబు 'గుంటూరు కారం'

Oct 3 2023 6:57 AM | Updated on Oct 3 2023 9:25 AM

Guntur Karam Changed The Fate Of Meenakshi Chowdary - Sakshi

హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ఫేట్‌ మారిపోయింది. త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. దీంతో ఆమె ఫేట్‌ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తర్వాత రవితేజతో ఖిలాడిలో కనిపించినా అంతగా గుర్తింపు దక్కలేదు.

కానీ మహేశ్‌ బాబు సినిమాలో ఛాన్స్‌ దక్కగానే ఆమెకు ఒక్కసారిగా భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే.. విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్‌ హీరోలతో పాటు కోలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్‌ హీరో అయిన దళపతి విజయ్‌తో జతకట్టే లక్కీ ఛాన్స్‌ తక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విజయ్‌ ఆంటోనీ 'కొలై' చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు వస్తున్న పాపులారిటీతో పలు సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!)

లియో చిత్రం చేస్తున్న విజయ్‌ తాజాగా తన 68వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకట్రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో నటుడు విజయ్‌ తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. యువన్‌ శంకరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటి స్నేహ, ప్రియాంక మోహన్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అరవిందస్వామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు ప్రియాంక మోహన్‌ స్థానంలో నటి మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement