హైదరాబాద్‌లో ఆటాపాట | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆటాపాట

Published Tue, Dec 19 2023 12:09 AM

Guntur Kaaram Movie Shooting in Hyderabad on December 21 - Sakshi

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ‘‘గుంటూరు కారం’ సినిమాలో నాలుగుపాటలు, ఓ బిట్‌ సాంగ్‌ ఉన్నాయి. వాటిలో మూడుపాటలు, బిట్‌ సాంగ్‌ పూర్తయ్యాయి. మిగిలిన ఓపాటను ఈ నెల 21 నుంచి చిత్రీకరించేలా ప్లాన్‌ చేశాం’’ అని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement