నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్‌ | Gopichand Interesting Comments In Bhimaa Movie Pre Release Event, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhimaa Movie: మామూలుగా ఇలా ఎప్పుడూ చెప్పను.. కానీ ఈ సినిమా మాత్రం..

Mar 3 2024 12:31 PM | Updated on Mar 3 2024 5:27 PM

Gopichand Comments In Bhimaa Pre Release Event - Sakshi

ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు.

మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్‌లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

అందులో డౌటే లేదు
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు.

ఆయన నవ్వుతోనే ఎనర్జీ..
దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్‌ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్‌గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్‌లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

చదవండి:  సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement