యదార్థ సంఘటన ఆధారంగా 'గూడు'.. ఫస్ట్‌ లుక్ పోస్టర్ రిలీజ్ | Goodu Movie First Look Poster Released Today | Sakshi
Sakshi News home page

First Look Poster: యదార్థ సంఘటన ఆధారంగా 'గూడు'.. ఫస్ట్‌ లుక్ పోస్టర్ రిలీజ్

May 7 2023 8:31 AM | Updated on May 7 2023 8:32 AM

Goodu Movie First Look Poster Released Today - Sakshi

కోలీవుడ్‌లో వైవిధ్యభరిత కథ, కథనాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందిన చిత్రమే గూడు. స్కైమూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల అధినేతలు ఎం.గణేశ్‌, పి.కన్నన్‌ కలిసి నిర్మిస్తున్న ఈజ్‌ చిత్రం ద్వారా జోయల్‌ విజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

విశేషం ఏంటంటే ఈ పోస్టర్‌లో నటీనటులు ఎవరు లేరు. చిత్రం టైటిల్‌కు అద్దం పట్టేలా గూడు ఫొటోను మాత్రమే పోస్టర్‌ పొందుపరిచారు. చిత్ర చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఇతివృత్తంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం వైవిద్యంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement