క్రైమ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' ! | Sarath Kumar's 'Criminal' Movie First Look Poster Released - Sakshi
Sakshi News home page

క్రైమ్ థ్రిల్లర్‌గా 'క్రిమినల్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!

Aug 26 2023 4:43 PM | Updated on Aug 26 2023 4:58 PM

Sharath Kumar Movie Criminals First Look Poster Released  - Sakshi

తమిళ నటుడు శరత్‌కుమార్, గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'క్రిమినల్'. దక్షిణామూర్తి ఈ చిత్రాన్ని పర్సా పిక్చర్స్, పీఆర్‌.మీనాక్షీసుందరం, బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్, ఐబీ.కార్తీకేయన్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నానని వాటిని తెరకెక్కించడానికి పలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. 

(ఇది చదవండి: Neha Shetty: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘రాధిక’)

అలాంటి సమయంలో తనకు టీకొట్టు వద్ద ఒక ఆలోచన వచ్చిందని అదే క్రిమినల్ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నటుడు శరత్‌కుమార్, గౌతమ్‌ కార్తిక్‌ ఈ కథలోకి  రావడంతో చిత్రానికి ఇంకా భారీ క్రేజ్ వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్‌లో నిర్మాతలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ  చిత్రం మాదిరి మదురై నేపథ్యంలో ఇంతకుముందు పలు ప్రేమ కథా చిత్రాలు వచ్చాయని.. అయితే వాటికి క్రిమినల్ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగే క్రైమ్, థ్రిల్లర్‌ సంఘటనలే ఈ చిత్రమని అన్నారు. కాగా దీనికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, ప్రసన్న ఎస్‌ కుమార్‌ ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌, విడుదల తేదీలను వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement