గరం గరం యముడయో... | Garam Garam song from Saripodhaa Sanivaaram is out | Sakshi
Sakshi News home page

గరం గరం యముడయో...

Published Sun, Jun 16 2024 6:12 AM | Last Updated on Sun, Jun 16 2024 1:00 PM

Garam Garam song from Saripodhaa Sanivaaram is out

అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్‌ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.

హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్‌ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్‌ సాహిత్యం అందించగా విశాల్‌ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement