Actor Satyadev: 'ఫుల్‌ బాటిల్‌'తో వస్తున్న యంగ్‌ హీరో..

Full Bottle Movie: Satyadev Next With Director Sharan Koppisetty - Sakshi

Full Bottle Movie: Satyadev Next With Director Sharan Koppisetty: విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్‌ ఒకరు. డిఫరెంట్‌ టైటిల్స్‌తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల 'స్కైలాబ్‌' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్‌ ప్రస్తుతం గాడ్సే, గుర్తుందా శీతకాలం మూవీస్‌తోపాటు కొరటాల శివ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా, హిందీలో 'రామసేతు' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ 'రామసేతు' సినిమాలో అక్షయ్‌ కుమార్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సత్యదేవ్‌ హీరోగా మరో చిత్రం బుధవారం (ఏప్రిల్ 6) ప్రారంభమైంది. ఈ సినిమా 'ఫుల్‌ బాటిల్‌' అనే టైటిల్‌తో సినిమా షూటింగ్‌ మొదలైంది. 

చదవండి: సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్‌

'కిర్రాక్‌ పార్టీ', సత్యదేవ్‌ 'తిమ్మరుసు' చిత్రాలను తెరకెక్కించిన శరణ్‌ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి మొదటి రెండు సినిమాలు కన్నడ రీమేక్స్‌ కాగా, ఇటీవల ఓటీటీ సంస్థ జీ5 కోసం 'గాలివాన' పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కాకినాడ నేపథ్యంలో 'ఫుల్‌ బాటిల్‌' రూపొందనున్నట్లు సమాచారం. రామాంజనేయులు జువ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో అలరించే సత్యదేవ్‌ 'ఫుల్‌ బాటిల్‌' కిక్కు ఎక్కాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. 

చదవండి: సత్యదేవ్‌ భార్యగా నయనతార

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top