‘‘ఫస్ట్‌ లవ్‌’ పాటలోనే కథ చూపించారు – ఎస్‌ఎస్‌ తమన్‌ | First Love Music Video Launched By SS Thaman, Watch Inside Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘‘ఫస్ట్‌ లవ్‌’ పాటలోనే కథ చూపించారు – ఎస్‌ఎస్‌ తమన్‌

Aug 6 2024 12:29 PM | Updated on Aug 6 2024 1:36 PM

First love Music Video Launched By SS Thaman

‘‘ఫస్ట్‌ లవ్‌’ టైటిల్‌ సాంగ్‌ మ్యూజిక్‌ వీడియో చాలా అందంగా ఉంది. ఈ పాటలోనే ఒక అద్భుతమైన కథ చూపించారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది’’ అని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ అన్నారు. దీపు జాను హీరోగా బాలరాజు ఎం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫస్ట్‌ లవ్‌’. వైశాలీ రాజ్‌ హీరోయిన్‌గా నటించి, నిర్మించారు. 

సంజీవ్‌ .టి సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ (‘ఫస్ట్‌ లవ్‌’) లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ తమన్‌ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ లవ్‌’ పాటలు వినగానే ‘వైశాలి, ఖుషి’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. మధు పొన్నాస్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘చాలా కష్టపడి ప్రేమతో ‘ఫస్ట్‌ లవ్‌..’ పాట చేశాం’’ అన్నారు. ‘‘అందరూ సెలబ్రేట్‌ చేసుకునే స్పెషల్‌ ఆల్బమ్‌ ఇది’’ అన్నారు బాలరాజు ఎం.  

Advertisement
 
Advertisement
Advertisement