హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్ | Fight Master Peter Hein Turned As Hero With Tamil Movie | Sakshi
Sakshi News home page

హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్

Jan 6 2024 7:34 AM | Updated on Jan 6 2024 9:09 AM

Fight Master Peter Hein Turned Hero With Tamil Movie - Sakshi

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు చేస్తున్న నటులు పెరుగుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ కూడా కథానాయకుడిగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథాచిత్రాన్ని ట్రెండ్స్‌ సినిమాస్‌ అధినేత జేఎం బషీర్‌, యంటీ సినిమాస్‌ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

నిర్మాతల్లో ఒకరైన బషీర్‌ మాట్లాడుతూ.. నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల్లో పీటర్‌ హెయిన్‌ భాగమే. ఇప్పుడు ఆయన హీరోగా పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నాం. 

ఇకపోతే పీటర్ హెయిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరికొత్త యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని అన్నాడు. ఇందులో నటించడానికి తాను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 

(ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!)

Advertisement
 
Advertisement
Advertisement