ఘనంగా బాలల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బాలల దినోత్సవం

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

న్యూస్‌రీల్‌

పిల్లలతో గడిపిన సీఎం విజయ్‌

కేకులు, గ్రీటింగ్‌ కార్డుల పంపిణీ

వంట గదిని తనిఖీ చేసి భోజనాన్ని పరిశీలించిన సీఎం

పెరంబూరులో వినతుల స్వీకరణ

తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు కేకులు పంపిణీ చేసింది. సీఎం విజయ్‌ చైన్నె కొళత్తూరులో పిల్లలకు కేకులను అందజేసి, వారితో సరదాగా గడిపారు. పిల్లలను

ఎత్తుకుని కేకు టేస్ట్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి పాఠశాల వంట గదిని తనిఖీ చేశారు. వండిన వంటకాలను రుచి చూశారు. అనంతరం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెరంబూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతులు స్వీకరించారు.

సాక్షి, చైన్నె : ప్రభుత్వం బాలల దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు. శనివారం సెలవు కావడంతో శుక్రవారం అన్ని పాఠశాలల్లో పిల్లలకు కేకులు పంపిణీ చేసింది. ఇందులో భాగంగా చైన్నె కొళత్తూరు నియోజకవర్గం, పెరంబూర్‌ మధుమానగర్‌లోని చైన్నె మిడిల్‌ స్కూల్‌లో సీఎం విజయ్‌ ఉదయం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

వంటగది తనిఖీ

కేకుల పంపిణీ అనంతరం సీఎం విజయ్‌ పాఠశాల వంటగదిని సందర్శించారు. మధ్యాహ్న భోజనం కోసం సిద్ధం చేసి ఉంచిన బియ్యం నాణ్యతను, సరుకుల నిల్వలను పరిశీలించారు. వంట సిబ్బందికి కేకులు అందజేశారు. అక్కడ సిద్ధం చేసి ఉంచిన వంటకాలను రుచిచూశారు. తర్వాత రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చి అక్కడ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. తదుపరి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెరంబూరు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కేకుల పంపిణీ

తమిళనాడు పౌర సరఫరాల సంస్థ ద్వారా బ్రిటానియా, డ్రీమ్‌ ప్యాక్‌, ఎలైట్‌ నాచురల్స్‌, ఐటీసీ సంస్థల నుండి మొత్తం 62.46 లక్షల కేక్‌ ప్యాకెట్లను కొనుగోలు చేసి, రెండు రోజుల ముందే అన్ని పాఠశాలలకు చేరవేశారు. చైన్నె కోడంబాక్కంలోని రంగరాజపురం ఉన్నత పాఠశాలలో మంత్రి, టీ.నగర్‌ ఎమ్మెల్యే ఎన్‌.ఆనంద్‌ విద్యార్థులకు కేకులు పంపిణీ చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలకు వెళ్లి పిల్లలకు స్వయంగా కేకులతోపాటు సీఎం విజయ్‌ తరఫున గ్రీటింగ్‌ కార్డులను అందజేశారు. పాఠశాల పిల్లలకు కేకులు ఇస్తున్నందున అంగన్‌వాడీ చిన్నారులు నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 54,483 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 11 లక్షల మందికి పైగా చిన్నారులకు ప్రభుత్వం తరఫున చక్కెర పొంగల్‌ పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement