ఫరాఖాన్‌ డైరెక్షన్‌లో నాగచెతన్య | Farah Khan To Team Up With Naga Chaitanya For A Commercial | Sakshi
Sakshi News home page

ఫరాఖాన్‌ డైరెక్షన్‌లో నాగచెతన్య

Mar 17 2021 8:21 PM | Updated on Mar 17 2021 9:32 PM

Farah Khan To Team Up With Naga Chaitanya For A Commercial - Sakshi

ముంబాయి: బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఫరాఖాన్‌, టాలీవుడ్‌ లవర్‌బాయ్‌ నాగచైతన్యలు కలిపి పనిచేస్తున్నారు. అయితే ఇది సినిమాలో కాదండీ..ఒక యాడ్‌లో. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో ఫరాఖాన్ తెలియనివారుండరు. ఆమె కొరియోగ్రాఫర్‌గా..దర్శకురాలిగా.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఒక  పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీనిలో ఫరాఖాన్‌ , టాలీవుడ్‌  లవర్‌బాయ్‌ నాగచైతన్యతో కలిసి ఒక కమర్షియల్ ‌యాడ్‌ ఫిల్మ్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అక్కినేని నాగార్జున సినిమాకు కొరియోగ్రఫి అందించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

అప్పటి నుంచి నాగార్జున తనకు మంచి ఫ్రెండ్‌ అయ్యాడని తెలిపింది. ఇప్పుడు ఆయన కుమారుడు నాగచైతన్యతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది. చైతూ మంచి ‘వండర్‌ ఫుల్‌ బాయ్‌’ అని ఇన్స్టాలో పోస్ట్‌‌ చేసింది. ఈ పోస్ట్ చూసి చైతు ‘మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై డైరెక్టర్‌ ముకేష్‌ ఛబ్రా, హిందీ నటి టబూలు నవ్వుతున్న ఎమోజీలతో తమ ఆనందాన్ని తెలిపారు. ఫరాఖాన్‌ తొలిసారిగా గుజర్‌గయా సినిమాకు కొరియోగ్రఫిగా చేశారు. ఆమె తన  56వ ఏటకూడా ఎంతో హుషారుగా ఉంటారు. పహలానషా, ఛయ్యా ఛయ్యా, ఎక్‌పల్‌కాజినా, షిలాకి జవాని, మున్నిబద్నాం హువీ అనే హిట్‌ పాటలకు కొరియోగ్రఫి అందించారు.. కాగా, ఆమె శిరిష్‌ కుందర్‌ను  పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 

చదవండి: నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ.. స్టార్‌ హీరో సినిమాలో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement