నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ.. స్టార్‌ హీరో సినిమాలో!

Akkineni Naga Chaitanya Is All Set To Make His Bollywood Debut - Sakshi

టాలీవుడ్‌ లవర్‌బాయ్‌ అక్కినేని నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమిర్ ఖాన్‌ ‘లాల్సింగ్ చద్దా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగచైతన్య నటించున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్ర విజయ్ సేతుపతి చేయాల్సి ఉంది. కానీ అతనికి డేట్స్‌ కుదరకపోవడంన్యీ సినిమా నుంచి సేతుపతి తప్పుకున్నారు. దీంతో ఈ అవకాశం చైతన్యకు లభించినట్లు టాక్‌. లాల్‌ సింగ్‌ చద్దా కోసం నాగ చైతన్య మే నెలలో డేట్స్‌ కుదుర్చుకున్నట్లు, ఒకే షెడ్యూల్‌లోనే షూటింగ్‌ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక లాల్‌ సింగ్‌ చద్దా.. హాలీవుడ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’ సినిమా ఆధారంగా హిందీలో రీమేక్‌ అవుతోంది. ఇందులో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం ఈ హీరో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని పాటలలకు విశేష స్పందన లభిస్తంఓది. ముఖ్యంగా సారంగధరియా పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే 50 మిలియన్ల వ్యూవ్స్‌ను క్రాస్‌ చేసింది.  ఇక లవ్ స్టొరీ అనంతరం థాంక్యు సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

చదవండి: 'బుట్టబొమ్మ'ను బ్రేక్‌ చేసిన సారంగదరియా..
మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top