breaking news
Addfilms
-
ఫరాఖాన్ డైరెక్షన్లో నాగచెతన్య
ముంబాయి: బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్, టాలీవుడ్ లవర్‌బాయ్ నాగచైతన్యలు కలిపి పనిచేస్తున్నారు. అయితే ఇది సినిమాలో కాదండీ..ఒక యాడ్‌లో. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్లో ఫరాఖాన్ తెలియనివారుండరు. ఆమె కొరియోగ్రాఫర్‌గా..దర్శకురాలిగా.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిలో ఫరాఖాన్ , టాలీవుడ్ లవర్‌బాయ్ నాగచైతన్యతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అక్కినేని నాగార్జున సినిమాకు కొరియోగ్రఫి అందించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి నాగార్జున తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని తెలిపింది. ఇప్పుడు ఆయన కుమారుడు నాగచైతన్యతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది. చైతూ మంచి ‘వండర్ ఫుల్ బాయ్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి చైతు ‘మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని కామెంట్ చేశాడు. దీనిపై డైరెక్టర్ ముకేష్ ఛబ్రా, హిందీ నటి టబూలు నవ్వుతున్న ఎమోజీలతో తమ ఆనందాన్ని తెలిపారు. ఫరాఖాన్ తొలిసారిగా గుజర్గయా సినిమాకు కొరియోగ్రఫిగా చేశారు. ఆమె తన 56వ ఏటకూడా ఎంతో హుషారుగా ఉంటారు. పహలానషా, ఛయ్యా ఛయ్యా, ఎక్పల్కాజినా, షిలాకి జవాని, మున్నిబద్నాం హువీ అనే హిట్ పాటలకు కొరియోగ్రఫి అందించారు.. కాగా, ఆమె శిరిష్ కుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) చదవండి: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో! -
షూటింగ్‌కు వెళ్లి.. యువతి అదృశ్యం
సాక్షి, శంషాబాద్(రాజేంద్రనగర్) : యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేసేందుకు డార్జిలింగ్ వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్జీఐఏ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన కోటేశ్వర్రావు కుమార్తె షణ్ముక ప్రియ(18) ఇంటర్ పూర్తిచేసి యాడ్‌ఫిల్మ్ దర్శకుల వద్ద సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కమల్సేతు అనే దర్శకుడి వద్ద డార్జిలింగ్‌లో జరిగే షూటింగ్‌కు వెళ్లాలని చెప్పడంతో గత నెల 17న ఆమె తల్లి ఉషాకుమారి.. షణ్ముక ప్రియను శంషాబాద్ విమానాశ్రయంలో వదిలి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం తల్లికి ఫోన్ చేసిన షణ్ముక ప్రియ తాను కోల్‌కతాకు చేరుకున్నానని ఆగస్టు 28 తిరిగి వస్తానని తెలిపింది. ఆ తరువాత ఆమె ఫోన్‌కు పలుమార్లు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందిన కుటుంసభ్యులు బుధవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా షణ్ముక ప్రియ జాడ తెలియకపోవడంతో ఆమె కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు.