మన దగ్గర దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ హాలీవుడ్‌లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం థియేటర్లలో, ఆపై ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్న చిత్రం 'ఫాల్'. 2000 వేల అడుగుల ఎత్తు ఉన్న ఓ పాడుబడ్డ టవర్‌పై ఇద్దరమ్మాయిలు చిక్కుకుంటే ఏమైందనేది కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా సిద్ధం చేశారు. ట్రైలర్ వదిలారు.
(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం)
ట్రైలర్ బట్టి చూస్తే ఈసారి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలపై అడ్వెంచర్ కోసం వెళ్లి ఇద్దరు ఆడపిల్లలు చిక్కుకుపోతారు. తర్వాత ఏమైంది? వీళ్లు బతికి బయటపడ్డారా? లేదా అనేది స్టోరీ అనిపిస్తోంది. తొలి పార్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. చూస్తే మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో భయపడిపోతారు. మరి ఈ ఏడాది థియేటర్లలో రిలీజయ్యే సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి?
(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి హీరో రాఘవ లారెన్స్? పోస్టుతో క్లారిటీ)


