రత్నం సినిమా నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది | Ethanaala Lyrical Video Song From Rathnam Movie Is Out | Sakshi
Sakshi News home page

రత్నం సినిమా నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది

Apr 1 2024 8:44 AM | Updated on Apr 1 2024 9:22 AM

Ethanaala Lyrical Video Song From Rathnam Movie - Sakshi

నటుడు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రత్నం. కమర్షియల్‌ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తామరబరణి, పూజ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి అన్నది గమనార్హం. కాగా తాజాగా విశాల్‌ దర్శకుడు హరి కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రం రత్నం. నటి ప్రియా భవాని శంకర్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో సముద్రఖని, యోగిబాబు, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్‌ సుబ్బురాజ్‌ స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌, జి.స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈచిత్రాన్ని ఏప్రిల్‌ 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని సింగిల్‌ సాంగ్‌ ఇటీవల విడుదల చేశారు. తాజాగా రెండవ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఎదనాల అనే పల్లవితో సాగే ఈ మెలోడి పాటను గీత రచయిత వివేక్‌ రాయగా నటుడు విశాల్‌, నటి ప్రియా భవాని శంకర్‌లపై చిత్రీకరించినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు.

రత్నం చిత్రం కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్‌ ఇంతకుముందు నటించిన మార్క్‌ ఆంటోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత రాబోతున్న రత్నం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement