ఒకప్పుడు ఫేమస్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడు ఐఏఎస్‌గా.. | Do You Know This Actress Who Left Movies To Become IAS Officer, See Her Inspirational Story Inside | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ కోసం ప్రయత్నాలు.. ఎన్నోసార్లు ఫెయిలైన నటి.. చిట్టచివరకు!

Feb 29 2024 4:12 PM | Updated on Feb 29 2024 4:24 PM

Do You Know This Actress Who Left Movies To Become IAS Officer, See Her Inspirational Story Inside - Sakshi

దేశంలోనే అతి క్లిష్ట పరీక్షల్లో ఒకటైన యూపీఎస్‌సీ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసా

సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం.. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సినిమాలు వదిలేసి రోడ్డునపడ్డవాళ్లమూ చూశాం.. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయసులో సినిమాలు చేసింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఏఎస్‌ సాధించింది.

బాలనటిగా బోలెడు సినిమాలు..
ఆవిడే హెచ్‌ఎస్‌ కీర్తన.. బాల్యంలో నటనతో అందరినీ కట్టిపడేసింది. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిపైనా తళుక్కుమని మెరిసింది. కన్నడలో సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. కర్పూరద గోంబే, గంగ-యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, ఎ, కనూర్‌ హెగ్గడటి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఓ మల్లిగె, లేడీ కమిషనర్‌, హబ్బ, డోరె, సింహాద్రి, జనని, చిగురు, పుతని ఏజెంట్‌.. ఇలా పలు చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది.

ఆరో ప్రయత్నంలో..
రానురానూ తనకు చదువుపై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్‌ అవ్వాలనుకుంది, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశంలోనే అతి క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్‌సీ ఎగ్జామ్‌ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసారి(2020లో) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆలిండియా లెవల్‌లో 167వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా అపాయింట్‌ అయింది.

రెండేళ్లు ఆ పని చేశాక ఐఏఎస్‌
అయితే దీనికంటే ముందు 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌(KAS) కూడా రాసింది. ఈ పరీక్షలో పాస్‌ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారిణిగా సేవలందించింది. ఆ తర్వాత ఐఏఎస్‌ జాబ్‌ కొట్టింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యామని చతికిలపడేవారికి కీర్తన స్టోరీ ఒక ఇన్‌స్పిరేషన్‌ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు!

చదవండి: చులకన, వేధింపులు.. చాలా ఏళ్లు బాధపడ్డా.. ఇకపై అస్సలు ఊరుకోను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement