తెలుగులో ఫేమస్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. హీరోయిన్‌గానూ చేసింది! | Do You Guess This Actress And Who Is Famous As Child Artist, Know Interesting Facts About Her In Telugu - Sakshi
Sakshi News home page

హిట్‌ సినిమాల చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడేంటి ఇంతందంగా మారిపోయింది!

Mar 23 2024 8:34 PM | Updated on Mar 24 2024 5:41 PM

Do You Guess This Actress, Who Famous as Child Artist - Sakshi

కొందరిది షార్ట్‌ జర్నీ అయితే మరికొందరిది లాంగ్‌ జర్నీ.. అయితే కొందరు తక్కువ సినిమాలు చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. పైన కనిపిస్తున్న బ్యూటీ అలాంటి చిత్రాలే చేసింది.

సినిమాల్లో అందరూ నిలదొక్కుకోలేరు. కొందరిది షార్ట్‌ జర్నీ అయితే మరికొందరిది లాంగ్‌ జర్నీ.. అయితే కొందరు తక్కువ సినిమాలు చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. పైన కనిపిస్తున్న బ్యూటీ అలాంటి చిత్రాలే చేసింది. 'తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ మనసంతా నువ్వేలో ఆడిపాడింది. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఈ మూవీతో పాటు గణేశ్‌, ప్రేమంటే ఇదేరా, హిందుస్తాన్‌: ద మదర్‌, ఎలా చెప్పను, ఆనందమానందమాయె వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

తర్వాత హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో సవాల్‌, స్నేహగీతం వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు సినిమాలు చేసింది. కానీ ఏవీ తనకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. దీంతో సడన్‌గా సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2011లో అప్పవి(తమిళ మూవీ) ఆమె నటించిన చివరి చిత్రం.

ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. 2022లో ఎంటర్‌ప్రెన్యూర్‌, సంగీతకళాకారుడు విభర్‌ హసీజాను పెళ్లాడింది. అప్పటినుంచి ఇద్దరూ తెగ టూర్లు చుట్టేస్తున్నారు. సుహానీ అయితే ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయింది! ఇటీవలే ఈ దంపతులు దుబాయ్‌ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది నటి. గత నెలలో అమెరికాలో పారిస్‌, వాషింగ్టన్‌ ప్రాంతాలను చుట్టేసింది. పెళ్లయ్యాక సుహానీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోందంటున్నారు నెటిజన్లు.

చదవండి:  పెళ్లయి ఎనిమిదేళ్లు.. ఇంకా పిల్లల్ని కనరా? వితికా ఆన్సరిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement