DJ Tillu First Day Collection: Siddu Jonnalagadda DJ Tillu Movie First Day Box Office Collections - Sakshi
Sakshi News home page

DJ Tillu First Day Collections: డీజే టిల్లు సెన్సేషన్‌.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌తో రికార్డు

Feb 13 2022 12:04 PM | Updated on Feb 13 2022 1:32 PM

DJ Tillu First Day Box Office Collections - Sakshi

DJ Tillu First Day Collection:: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు'  చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్‌ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.

విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు రీసౌండ్‌ వినిపిస్తుంది. ఇండియా సహా ఓవర్సీస్‌లోనూ మంచి షేర్స్‌ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్‌ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ రూ. 8.10కోట్ల షేర్‌ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలను తీసుకొస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement