రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా | Director Vivek Agnihotri Announces Mahabharata Inspired New Three Part Movie Parva, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

MahaBharatam Movie: మూడు పార్టులుగా 'మహాభారతం'.. తీస్తుంది రాజమౌళి కాదు

Published Sat, Oct 21 2023 5:18 PM | Last Updated on Sat, Oct 21 2023 6:27 PM

Director Vivek Agnihotri Announces Mahabharat Movie Three Parts - Sakshi

'మహాభారతం' సినిమా తీయాలనేది నా కల. ఇది స్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలాఏళ్ల క్రితమే చెప్పిన మాట. ఇప్పటి జనరేషన్ దర్శకుల్లో పీరియాడికల్ చిత్రాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అనేంతలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే జక్కన షాక్ ఇస్తూ ఓ డైరెక్టర్ 'మహాభారతం' సినిమాని ప్రకటించాడు. ఇప్పుడదే మూవీ లవర్స్‪‌ని కంగారు పెడుతోంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!)

హిందీలో ఏవేవో సినిమాలు తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కనీసం గుర్తింపు సంపాదించలేకపోయాడు. 'ది తాష్కెంట్ ఫైల్స్'తో కాస్త ఫేమ్ వచ్చింది. ఇక 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్‌ని క్యాష్ చేసుకోవాలని 'ద వ్యాక్సిన్ వార్' మూవ తీశారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కనీసం వసూళ్లు తెచ్చుకోలేక ఘోరమైన డిజాస్టర్ అయింది.

ఇప్పుడు 'మహాభారతం' సినిమాని మూడు భాగాలుగా తీస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు. 'పర్వ' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు కృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి 'ద కశ్మీర్ ఫైల్స్' తప్ప చెప్పుకోదగ్గ రేంజులో ఒక్కటంటే ఒక్క సినిమా తీయలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి.. 'మహాభారతం' చిత్రాన్ని ఏం చేస్తాడోనని ఆడియెన్స్ కంగారుపడుతున్నారు.

(ఇదీ చదవండి: 'భగవంత్‌ కేసరి'కి షాకిచ్చిన తారక్‌,మెగా ఫ్యాన్స్‌.. భారీగా నష్టాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement