SS Rajamouli: ఎందరో ఇలాంటి కలతో బతుకుతున్నారు

సినిమా ప్రతి ఒక్కరి కల ‘‘సినిమా అనేది ప్రతి ఒక్కరి కల. ఈ చిత్రంతో మీరంతా (‘ఓ కల’ మూవీ యూనిట్) ఆ కలను నెరవేర్చుకున్నారు. ఇంకా ఎందరో ఇలాంటి కలతో బతుకుతున్నారు. గట్టిగా కృషి చేస్తే వారి కల కూడా నెరవేరుతుంది. ‘ఓ కల’ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ రాజమౌళి అన్నారు.
గౌరీశ్ యేలేటి హీరోగా, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ కల’. లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, ఆదిత్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రాజమౌళి విడుదల చేశారు. ‘‘అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చక్కని ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు దీపక్ కొలిపాక.
చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ
పెళ్లి రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన సాయిపల్లవి, అప్‌డేట్ ఇచ్చిందిగా!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు