ఓ ప్రేమ జంట జీవితం | Director Narasimha Nandi new movie on Corona Lockdown | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమ జంట జీవితం

Oct 5 2020 6:18 AM | Updated on Oct 5 2020 6:18 AM

Director Narasimha Nandi new movie on Corona Lockdown - Sakshi

నరసింహ నంది దర్శకత్వంలో అంతా కొత్తవారితో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 15న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానున్న సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘2011లో ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, 3 నంది అవార్డులు అందుకున్నాను. 2013లో ‘కమలతో నా ప్రయాణం’ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. 2016లో తీసిన ‘లజ్జ’ సినిమాను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపించాను. ఇటీవలే యూత్‌ కోసం ‘డిగ్రీ కాలేజ్‌’ అనే సినిమా తీశాను. తాజా చిత్రం కరోనా లాక్‌ డౌన్‌లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో  తీసుకునే నిర్ణయాల వల్ల ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం అయింది? అనే కథాంశంతో ఉంటుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్‌ రెడ్డి, సంగీతం: సుకుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement