నాటకం అమ్మలాంటిది – అనిల్‌ రావిపూడి | Director Anil Ravipudi Speech At Utsavam Movie Pre-Release Event | Sakshi
Sakshi News home page

నాటకం అమ్మలాంటిది – అనిల్‌ రావిపూడి

Sep 12 2024 4:03 AM | Updated on Sep 12 2024 4:03 AM

Director Anil Ravipudi Speech At Utsavam Movie Pre-Release Event

‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్‌తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ  సాయి దర్శకత్వంలో సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది.

 ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనిల్‌ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్‌ ప్రకాష్‌. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ  సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్‌ పాటిల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్‌ రూబె¯Œ్స, లిరిక్‌ రైటర్‌ అనంతశ్రీరామ్, రైటర్‌ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్‌ శశి మాట్లాడారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement