
హీరోయిన్ డింపుల్ హయాతి(Dimple Hayathi ) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడపడి కేసుల పాలైన ఈ బ్యూటీ.. మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి పిలుపించుకున్న యువతులను డింపుల్ హయతి, ఆమె భర్త వేధింపులకు గురి చేశారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది.
‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ భర్త దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ పీకలేరు’ అంటూ డింపుల్ హయాతి కూడా అమ్మాయిలపై ఫైర్ అయిందని ఆ మహీళ పేర్కొంది. డింపుల్ భర్త లాయర్ చేప్పడంతో.. అసలు ఆమెకు పెళ్లి ఎప్పుడు అయిందని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అంతేకాదు అమ్మాయిల పట్ల అలా దురుసుగా ప్రవర్తించిన డింపుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డింపుల్ సినిమా విషయాలకొస్తే.. ‘రామబాణం’లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాంప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘భోగీ’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోసారి వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి
కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని పిలిపించి.. ఒరిస్సా నుంచి వచ్చిన యువతులను వేధించిన డింపుల్ హయాతి, ఆమె భర్త
పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించింది అంటూ ఆరోపించిన మహిళ
మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు… https://t.co/PfeNndxVn2 pic.twitter.com/lqUtEDZPBO— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025