Dhruv Vikram's Next Film After Mari Selvaraj Project, Details Revealed - Sakshi
Sakshi News home page

Dhruv Vikram: సరైన హిట్‌ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న విక్రమ్‌ కొడుకు

May 27 2023 9:03 AM | Updated on May 27 2023 9:20 AM

Dhruv Vikram Next Film After Mari Selvaraj Project Details Revealed - Sakshi

కొందరికి సక్సెస్‌ అనేది కాస్త ఆలస్యంగానే వస్తుంది. యువ నటుడు ధ్రువ్‌విక్రమ్‌ ఈ కోవలోకే వస్తారు. ప్రముఖ నటుడు విక్రమ్‌ వారసుడు ఈయన అన్నది తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విక్రం తన వారసుని ఆదిత్యవర్మ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశారు. ఇది తెలుగులో విజయాన్ని సాధించిన అర్జున్‌ రెడ్డి చిత్రానికి రీమేక్‌. అయితే కారణాలు ఏమైనా ఈ చిత్రం ధ్రువ్‌విక్రమ్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈయన తన తండ్రితో కలిసి మహాన్‌ అనే చిత్రంలో నటించారు.

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడం వలనో, వేరే కారణాలు వలనో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే ధ్రువ్‌విక్రమ్‌ నటనకు మాత్రం విమర్శకల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈసారి కాస్త ఆలస్యం అయినా గట్టిగా హిట్‌ కొట్టే తీరాలి అన్న దృఢ సంకల్పంతో ఈ యువనటుడు ఉన్నట్లు తెలుస్తోంది.

అలా నాలుగేళ్లుగా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో పరియోరుమ్‌ పెరుమాళ్‌, కర్ణన్‌ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్‌ వైవిధ్యభరిత కథతో ధ్రువ్‌విక్రమ్‌ ను డైరెక్టర్‌ చేయడానికి ముందుకు వచ్చారు.అయితే ఆయన ఉదయనిధి స్టాలిన్‌, కీర్తీసురేష్‌ జంటగా నటించిన మామన్నన్‌ చిత్ర చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం విడుదల తరువాత ధ్రువ్‌ విక్రమ్‌తో చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ దానికంటే ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. డాడా చిత్రం ఫేమ్‌ గణేష్‌ బాబు దర్శకత్వంలో నటించడానికి కమిట్‌ అయినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement