Dhoni Entertainments LGM's Telugu Version Locks Release Date - Sakshi
Sakshi News home page

తెలుగులో ధోని ‘ఎల్‌జీఎమ్‌’ వచ్చేస్తుంది

Aug 1 2023 10:09 AM | Updated on Aug 1 2023 11:35 AM

Dhoni Entertainments LGM Movie Telugu Release Date Out - Sakshi

భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ‘ఎల్‌జీఎమ్‌’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్‌ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో రమేష్‌ తమిళ్‌మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళంలో ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో జేపీఆర్‌ ఫిల్మ్ప్, త్రిపుర ప్రొడక్షన్స్‌  రిలీజ్‌ చేస్తున్నాయి.

ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో హరీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియాలే ఈ సినిమాకు ప్రధాన బ‌లం. పెళ్లికి ముందే కాబోయే అత్త‌గారికి కండీష‌న్స్ పెట్టిన గ‌డుస‌రి కోడ‌లుగా ఇవానా క‌నిపిస్తుంది. ల‌వ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఇవానా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె న‌ట‌న ఎలా ఉండ‌బోతుంద‌నేది ట్రైల‌ర్‌లో చిన్న ట‌చ్‌తో చూపించించారు ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడ‌లి పెట్టిన కండీష‌న్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే త‌ల్లి పాత్ర‌లో న‌దియా న‌టించారు.

‘‘ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి తెలుసుకునేందుకు ఆమెతో కొద్ది రోజులు జర్నీ చేయాలనుకుంటుంది. ఈ  పాయింట్‌తో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement