లొంగని రాక్షసుడు | Sakshi
Sakshi News home page

లొంగని రాక్షసుడు

Published Fri, May 10 2024 4:27 AM

Dhanush Rayan Adangaatha Asuran Lyric Video song release

ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్‌’. సందీప్‌ కిషన్, కాళిదాసు జయరామ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్‌ 13న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్‌ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

ఈ పాటకు లిరిక్స్‌ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్‌. ‘‘అడంగాద అసురన్‌’ పాటను ఏఆర్‌ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్‌ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్‌ చేశాం’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు ధనుష్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement