Devatha : సత్య-ఆదిత్యలను పెళ్లి చేసుకోవాలని కోరిన రుక్మిణి | Devatha Serial : Adithya Disagrees With Rukminis Decision | Sakshi
Sakshi News home page

Devatha : సత్య-ఆదిత్యలను పెళ్లి చేసుకోవాలని కోరిన రుక్మిణి

Jun 25 2021 3:02 PM | Updated on Jun 25 2021 3:22 PM

Devatha Serial : Adithya Disagrees With Rukminis Decision - Sakshi

సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటివి మాట్లాడొద్దని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెబుతుంది. ఇందుకు రుక్మిణి అడ్డుపడతుంది. మరోవైపు ఆదిత్యతో రుక్మిణి సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి దేవుడమ్మ కనిపెడుతుంది. వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని ఆలోచనలో పడిపోతుంది. సీన్‌కట్‌ చేస్తే..హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు కూడా ఆదిత్యను తోడు తీసుకెళ్లకుండా దేవుడమ్మ అడ్డుపడుతుంది. రుక్మిణి-సత్యలను మాత్రమే వెళ్లాల్సిందిగా ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 25న 269వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

ఆదిత్యతో మాట్లాడాలని చెప్పిన రుక్మిణి సత్య గదిలోకి రావడానికి ఎందకు భయపడుతున్నావ్‌ అని ప్రశ్నిస్తుంది. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కోప్పడుతుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉందని, అది మీ ఇద్దరు ఒక్కటి కావాలని చెప్తుంది. ఆదిత్య సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదని తేల్చిచెప్పేస్తాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పడంతో రుక్మిణి అడ్డుపడుతుంది. సీన్‌కట్‌ చేస్తే.. మృగశిర మాసం ప్రారంభం కానుండటంతో నువ్వుల నూనె రాసుకోవాలని దేవుడమ్మ ఆదిత్యకు చెబుతుంది.

రుక్మిణిని పిలిచి నీ పెనిమిటికి నూనె రాయి అని చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అయితే ఇందుకు రుక్మిణి ఒప్పుకోదు. దేవుడమ్మ వచ్చే సమయానికి అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని దేవడమ్మ సందేహిస్తుంది. సీన్‌కట్‌ చేస్తే..సత్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రుక్మిణి చెప్పగ, అందుకు తన పర్మిషన్‌ అక్కర్లేదని చెప్తుంది. ఆదిత్యను తోడు తీసుకెళ్లబోతుంటే అందుకు దేవుడమ్మ అడ్డు చెబుతుంది. మిల్లు వద్ద పనులు ఉన్నాయని, అవి చూసుకోవాలని చెప్పి రుక్మిణి-సత్యలను వెళ్లమంటుంది. మరోవైపు రుక్మిణి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందని ఆదిత్య ఆలోచనలో పడిపోతాడు. మరి రుక్మిణి పడుతున్న ఆరాటం దేవుడమ్మ కనిపెడుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement