ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్? | Devara: No Chance For Daavudi Song In Theatre Version | Sakshi
Sakshi News home page

Devara Movie: మాస్ పాటని సినిమా నుంచి తీసేశారా?

Sep 17 2024 1:04 PM | Updated on Sep 17 2024 1:13 PM

Devara: No Chance For Daavudi Song In Theatre Version

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'దేవర' గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి అద్భుతమైన పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా. అందున తెలుగు కంటే హిందీలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతోంది. ఇది గనక నిజమైతే అభిమానులకు బ్యాడ్ న్యూసే.

(ఇదీ చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతిపై సందేహాలు)

వారం క్రితం ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ రిలీజైంది. మిశ్రమ స్పందన వచ్చింది. అంతకు ముందు రిలీజ్ చేసిన మూడు పాటల‍్ని కూడా తొలుత కాపీ ట్యూన్స్ అని ట్రోల్ చేశారు. కొన్నిరోజులకే అవే పాటల్ని రిపీట్స్‌లో వింటున్నారు. వీటిలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టిన 'దావుదీ'  అనే సాంగ్ కూడా ఉంది.

సినిమాలో సిట్చూయేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డ్యాన్స్ చూడటం కష్టమే. ఎందుకంటే 'చుట్టమల్లే' పాటలోనూ తారక్ డ్యాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డ్యాన్స్ ఉండదు. మరి సినిమాలో 'దావుదీ' ఉంటుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)

Advertisement
 
Advertisement
Advertisement