లొకేషన్‌ ఫిక్స్‌ | Detroit shoot location for Maheshbabu Sarkaru Vaari Paata | Sakshi
Sakshi News home page

లొకేషన్‌ ఫిక్స్‌

Sep 15 2020 6:36 AM | Updated on Sep 15 2020 6:36 AM

Detroit shoot location for Maheshbabu Sarkaru Vaari Paata - Sakshi

‘సర్కారు వారి పాట’ చిత్రబృందం అమెరికాలో షూటింగ్‌ చేయబోతుందనే సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో ఎక్కడ షూట్‌ చేయాలో కూడా ఫిక్సయ్యారట. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. బ్యాంక్‌ స్కామ్‌ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్‌ చేశారు. యూఎస్‌లోని డెట్రాయిట్‌లో చిత్రీకరణ జరుపుతారట. త్వరలోనే దర్శకుడు పరశురామ్, కెమెరామేన్‌ మది డెట్రాయిట్‌లో లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేస్తారట. కీర్తీ సురేశ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement