బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌ 

DeepikaPadukone tests positive for COVID-19 - Sakshi

దీపికా పడుకొనే  కుటుంబంలో కరోనా కలకలం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ప్రకాష్‌ పడుకొనే

హోం ఐసోలేషన్‌లో తల్లి, సోదరి

సాక్షి, బెంగళూరు:  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే  కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో దీపికా త్వరగా కోలుకోవాలంటూ అమె  అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తను  దీపిక ఇంకా ధృవీకరించలేదు. కానీ ఇప్పటికే దీపికా కుటుంబం కరోనాతో బాధపడుతున్న సంగతి  తెలిసిందే. గత నెలలో దీపికా భర్త రణవీర్‌తో కలిసి  బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. 

తల్లిదండ్రులు, సోదరి కరోనా సోకింది. దీపికా తండ్రి , ప్రముఖ  క్రీడాకారుడు  ప్రకాష్‌ పడుకొనే  బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయనతోపాటు దీపికా తల్లి  ఉజ్జల, సోదరి అనీషాకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  ఇటీవలే ప్రకాష్‌  వ్యాక్సిన్‌ మొదటి డోసును స్వీకరించారు. అయితే ప్రకాష్‌ పదుకొనే ఆరోగ్యం  నిలకగానే ఉందని, మరో రెండో రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్‌ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి : విషాదం: కరోనాతో హీరోయిన్‌ సోదరుడు మృతి 
దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్‌ పడుకొనే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top